నిరుపేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

75 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పంపిణీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

ఆపత్కాల సమయంలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరుశాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన బంటు చరణ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన 75 వేల రూపాయల విలువైన ఎల్ఓసి పత్రాలను శనివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *