మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరాలకు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రజక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరిగినసాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. నేటి తరానికి వారి చరిత్రను తెలిపేలా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, రజక సంఘం అధ్యక్షులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.
