తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటన పోరాటానికి స్ఫూర్తి ఐలమ్మ

politics Telangana

బహుజనుల కోసం బంధుకులు పట్టి

సమానత్వం కోసం పోరాడిన వీరనారి

ఆ మహనీయుల స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

పెత్తందారుల చేతిలో అణిచివేయబడ్డ వర్గాలకు తిరుగుబాటు తత్వాన్ని నేర్పించి ప్రతిఘటించే పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగదనుల అమరత్వమేనని ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు.
నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలు జమీందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఆ మహనీయుల త్యాగఫలంతో వారు ఇచ్చిన స్ఫూర్తితో సిద్ధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహనీయుల ఆశయాల కనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పంతో హైదరాబాద్ లోని మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరుని పెట్టి ఆ వీరనారికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు.

రేవంతన్న స్ఫూర్తితో సబ్బండ, బడుగు బలహీన వర్గాల హక్కులకే పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ మోతె సుమలత, కౌన్సిలర్స్ సంగన్నగారి గోపాల్, దస్తగిరి, వెంకటేష్, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, మాజీ PACS చైర్మన్ పొట్టి నారాయణ రెడ్డి, నర్సింగ్ యాదవ్, రజక సంఘం సభ్యులు చాకలి సత్యనారాయణ, చాకలి బాబు, చాకలి అర్జున్,చాకలి యాదయ్య, చాకలి రవి, చాకలి కిషోర్, చాకలి చందు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *