రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బలరాం అన్నారు .చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని రామచంద్రపురం పట్టణంలోని బాల విహార్ పార్క్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. సామాజిక వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, అణగారిన ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణ రజక సంఘం కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో రజక సంఘం రామచంద్రపురం పట్టణ శాఖ నాయకులు చాకలి నరసింహ, ప్రభు, చాకలి లింగయ్య, శ్రీనివాస్, సాయి, అంజయ్య, బిక్షపతి కృష్ణ, సుధాకర్, తుకారం, అనిల్, సతీష్, పాల్గొన్నారు.
