పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడల్లో యువతను ప్రోత్సహించడమే యండిఆర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని మాద్రి పృథ్వీరాజ్ అన్నారు .సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ కలిసి చిన్నారులను, కోచ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆర్థిక కష్టాలు క్రీడాకారుల ప్రతిభకు అడ్డంకి కాకూడదు అని పటాన్‌చెరు ప్రాంతంలో ఎంతోమంది దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్ విజయాలకు యండిఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని తెలిపారు. .ఈ నెల 12వ తేదీన భూపాలపల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికావడం చాల సంతోషకరమని తెలిపారు . రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మైఖేల్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న యండిఆర్ ఫౌండేషన్ అధినేత మాద్రి పృథ్వీరాజ్ ముందుకు వచ్చారు. మైఖేల్‌కు ప్రయాణ, ఇతర ఖర్చుల నిమిత్తం యండిఆర్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు.
