పటానిచేరు జర్నలిస్ట్ ల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి

politics Telangana

* అర్హులైన జర్నలిస్టు ల ఇండ్ల స్థలాల కోసం కృషి

* యూనియన్ల పేర్లు చెప్పి కొందరు చేస్తున్న కుట్రలను తిప్పి కొడతాం.

* పటాన్ చెరు నియోజవర్గం అధ్యక్షుడు నర్సింహ

* పటాన్ చెరు లో టీయూడబ్ల్యూజే ఐజేయూ కార్యవర్గ సమావేశం.

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్ చెరు జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపత్కాలంలో జర్నలిస్ట్ ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించేలా కృషి చేస్తామని పటాన్ చెరు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే ఐజేయూ అధ్యక్షుడు పత్తి నర్సింహ అన్నారు.
గురువారం పటాన్ చెరు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో టీయూడబ్ల్యూజే ఐజేయూ పటాన్ చెరు నియోజకవర్గ నూతన కమిటీ మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కమిటీ సభ్యులు చర్చించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో కొందరు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని కొందరు జర్నలిస్టులకు కొన్ని కారణాల వలన ప్లాట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని జర్నలిస్టులు కమిటీ దృష్టికి తీసుకుని వచ్చారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని కలిసి ప్లాట్ల విషయం పై చర్చిస్తే సానుకూలంగా స్పందించి అందరికి ఇండ్ల స్థలాలను అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఈ విషయంలో పటాన్ చెరు నియోజకవర్గ కమిటీ చొరవ తీసుకొని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్లాట్లు కేటాయించేలా ముందుకు రావాలని కోరారు. అదే విధంగా పటాన్ చెరు జర్నలిస్ట్ లకు సిటీ బస్ లలో ఉచిత ప్రయాణం కల్పించేలా చూడాలన్నారు. ఆపత్కాలంలో జర్నలిస్టులకు అండగా నిలిచేందుకు గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ విషయంపై అధ్యక్షుడు పత్తి నర్సింహ తో పాటు జర్నలిస్ట్ పెద్దలు మాట్లాడుతూ సంఘం తరఫున జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం పోరాటం కొనసాగుతోందన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో అందరూ జర్నలిస్టుల సహకారంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను కలిసి స్థలాలు కేటాయించేలా కోరుతామన్నారు.

పటాన్ చెరు జర్నలిస్టులకు ఆపత్కాలంలో అండగా నిలిచేందుకు జర్నలిస్టుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఐజేయూ మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తోందని నొక్కి చెప్పారు. ఇటీవల కొందరు వేరే యూనియన్ నాయకులు TUWJ IJU పై చేసిన అవాక్కులు చేవాక్కులు ఆపాలని, కనీస అవగాహన లేకుండ అర్థరహితమైన మాటలు మనుకోవలన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్నది కేవలం టి యు డబ్ల్యూ ఐజి మాత్రమేననిఅన్నారు. అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తో పాటు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అనుక్షణం జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నారన్నారు.

కొన్ని యూనియన్ల పేర్లు చెప్పుకుని జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి ప్రయత్నాలను టీయూడబ్ల్యుజే (ఐజేయూ) సమర్థంగా తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, గౌరవం కోసం సంఘం భవిష్యత్తులో మరింత బలంగా ఉద్యమిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పర్చ శ్రీనాథ్, పటాన్‌చెరు నియోజకవర్గ సలహాదారులు కాశిపతి, సులేమాన్, రామారావు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,
జిల్లా కమిటీ భాద్యులు శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాజిద్, శ్రీను, నియోజకవర్గ ఉపాధ్యక్షులు విట్టల్, రాజు, నాగేష్, రమేష్, జీవరత్నం, సంయుక్త కార్యదర్శులు వేణు,శ్రీనివాస్, ప్రభాకర్, కోటెశ్, ఆర్గనిసింగ్ సెక్రటరీలు ఆంజనేయులు, మహేష్, రాజు, వివేక్, శ్రీనివాస్, శంకర్ శేఖర్ మహేందర్ గౌడ్ సిద్దు శ్రీనివాస్, నాయుడు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *