వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో  సంగీతం కచేరీ కి నృత్యానికి అద్భుత స్పందన

Hyderabad Lifestyle Telangana

సునీత ఉపద్రష్ట – శోభన కార్యక్రమాలు హౌస్‌ఫుల్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

నగరం లో గత రెండు రోజులు గా వేదం ఆర్ట్ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో జరిగిన సంగీత కచేరీ కి మరియు నృత్య ప్రదర్శన కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.అమెరికాలో విజయవంతమైన ప్రదర్శనల అనంతరం భారతదేశంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించిన వేదం ఆర్ట్ రెండు రోజుల పాటు సంగీతం, సంస్కృతి, నృత్యాన్ని కలగలిపిన అద్భుత కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట టైంలెస్ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. భానుమతి కాలం నుంచి నేటి తరానికి చెందిన పాటల వరకు తెలుగు సినీ సంగీత ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సంగీత విహారం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసింది.ప్రత్యేక ఆకర్షణగా మాయాబజార్ చిత్రంలోని చిరస్మరణీయ గీతాలను పునఃసృష్టించగా, పాడుతా తీయగా చిన్నారులు వేదికపై రేలంగి – సావిత్రి పాత్రలను ఆవిష్కరించడం ప్రేక్షకుల నుంచి ఘన స్పందన అందుకుంది.

గానగంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళిగా ప్రత్యేక విభాగం నిర్వహించగా, ప్రేక్షకులు భావోద్వేగంతో స్పందించారు. చివర్లో పవన్ కళ్యాణ్ పాటల మెడ్లీ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, సాహితి చాగంటి, ధనుంజయ్ తదితర గాయకులు కూడా సునీతతో కలిసి పాల్గొన్నారు.పద్మభూషణ్ శోభన , ఎన్‌సెంబుల్ ప్రదర్శించిన “భావ్” ప్రేక్షకులను విశేషంగా అలరించింది. భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతం, భావ వ్యక్తీకరణ, విజువల్ ప్రెజెంటేషన్‌ల సమ్మేళనంగా రూపొందిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లింది.హైదరాబాద్‌లో ఒక భరతనాట్యం ప్రదర్శన హౌస్‌ఫుల్ కావడం విశేషమని, ఇది నగరంలో కళల పట్ల ప్రేక్షకుల ఆసక్తిని ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు తెలిపారు.వేదం తరఫున నిఖిల్ పోలెపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, ఆదరణ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు రెండు గొప్ప కళాకారుల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం మా కోసం గర్వకారణం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌కు అత్యుత్తమ సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.ఈ రెండు కార్యక్రమాల విజయంతో వేదం ఆర్ట్ భారతదేశంలో ప్రీమియం లైవ్ ఎంటర్టైన్‌మెంట్ మరియు సాంస్కృతిక వేదికగా తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *