రామచంద్రపురం,మనవార్తలు ప్రతినిధి :
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ డివిజన్ లోని 91 వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించార. ఆయా యూత్ అసోసియేషన్లకు సంగారెడ్డి బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి అన్న ప్రసాదాల కోసం చందాలు అందజేశారు. అనంతరం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి గణపతులు పెట్టిన యూత్ అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు . వచ్చే సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణనాధుని పూజించాలని కోరారు. యూత్ అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఐకమత్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు . నవరాత్రులు ఎంతో అద్భుతంగా, నిర్విఘ్నంగా జరిగాయని, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి పనులు ఏటువంటి విజ్ఞాలు లేకుండా జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. అనుకున్న పనులలో విజయం సాధించాలని వేడుకున్నట్లు వెల్లడించారు . వినాయకుడి కృపా కటాక్షాలతో భారతదేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాధుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
