sample page

సిరికొండ మధుసూదనాచారికి కంజర్ల కృష్ణమూర్తి చారి జన్మదిన శుభాకాంక్షలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి ఆయనను కలిసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, ప్రజాసేవలో మధుసూదనాచారి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృష్ణమూర్తి చారి ఆకాంక్షించారు

Continue Reading

దసరా ఉత్సవాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

మియాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : మియాపూర్ ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌లో ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి–దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డా. యలమంచి ఉదయ్ కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా. యలమంచి ఉదయ్ కిరణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా ఎఫ్‌సీఐ కాలనీ ఉత్సవ […]

Continue Reading

భూగర్భజలాల కాలుష్యం, అధిక TDSపై ఆందోళన ప్రజాభిప్రాయ సేకరణ పారదర్శకంగా నిర్వహించాలి: మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఇస్నాపూర్, పాశమైలారం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం, భూగర్భజలాల్లో అధిక TDS స్థాయిలపై ప్రజల్లో ఆందోళనలు ఉన్న నేపథ్యంలో, M/s. Medicare Environmental Management Private Limited సంస్థ ప్రతిపాదించిన రోజుకు 25 టన్నుల సామర్థ్యం గల ఉమ్మడి బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రం (CBMWTF)కు సంబంధించి ఈరోజు నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. […]

Continue Reading

నిరంతర అభ్యసం అవశ్యం: నిపుణులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో నిరంతర అభ్యాసం అవశ్యమని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలని, శ్రామిక శక్తి పరివర్తన కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విధానాన్ని అవలంబించాలని పరిశ్రమ నిపుణులు సూచించారు. హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్బీ) ‘మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం భవిష్యత్తు-దిశా నిర్ధేశం: కార్మిక చట్టాలు, మారుతున్న చట్టాపరమైన పరిస్థితులు’ అనే అంశంపై సోమవారం ప్యానెల్ చర్చను నిర్వహించింది. పరిణామం చెందుతున్న కార్మిక చట్టాలు, చట్టపరమైన అనుపాలన, అనిశ్చితి […]

Continue Reading

గీతంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఉత్సాహంగా పాల్గొని, తమ సృజనాత్మకతను చాటిన విద్యార్థులు ప్రోత్సహించిన అధ్యాపకులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో సోమవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అందరికీ అవగాహన కల్పించేలా నిర్వహించారు. గీతం స్టూడెంట్ లైఫ్ సహకారంతో, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని అనువర్తిత మనస్తత్వశాస్త్రం (Applied Psychology) విభాగం దీనిని ఏర్పాటు చేసింది. ‘అవగాహనతో ఉండండి, దయతో ఉండండి, మీలాగే ఉండండి’ అనే ఇతివృత్తంతో ఈ […]

Continue Reading

వనపర్తి లో సీబీఎస్‌ షాపింగ్‌ మాల్‌ లో *దసరా డబుల్ ధమాకా సేల్‌ ను ప్రారంభించిన సినీనటి పాయల్ రాజపుత్

వనపర్తి ,మనవార్తలు ప్రతినిధి : శ్రీ రంగ థియేటర్ ఎదురుగా వనపర్తి లో సినీనటి  పాయల్ రాజపుత్  చేతుల మీదుగా ఘనంగా *దసరా డబుల్ ధమాకా సేల్‌ ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి పాయల్ రాజపుత్ మాట్లాడుతూ . వనపర్తి కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్‌ దసరా డబుల్ ధమాకా సేల్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్‌ చేస్తానని […]

Continue Reading

తొలిరోజు ‘శ్రీ బాలా త్రిపుర సుందరి’ దేవిగా అమ్మవారి దర్శనం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు పట్టణంలోని ప్రముఖ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోకకళ్యాణార్థం, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుతూ ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి దివ్య మంగళ రూపంలో దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పూజా వేదికపై […]

Continue Reading

దుర్గామాత సేవలో పర్స శ్యామ్ రావు దంపతులు

ఉస్మాన్ నగర్‌లో విగ్రహం విరాళం.. న్యూ ఎంఐజీలో ముక్కుపుడక సమర్పణ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: పర్స శ్యామ్ రావు తెల్లాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోని తెల్లాపూర్ డివిజన్ 263, ఉస్మాన్ నగర్ హనుమాన్ టెంపుల్‌లో ఆదివారం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత తొలి పూజ కార్యక్రమంలో సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, ఆయన సతీమణి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే […]

Continue Reading

రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాలు

మొదటిరోజు త్రిపుర బాలసుందరిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండ గ్రామంలో రామేశ్వరం బండ దుర్గామాత అసోసియేషన్ పెద్దలు అంతిరెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, మరియు యువత ఆధ్వర్యంలో విజయదశమి దుర్గామాత నవరాత్రుల అమ్మవారి పూజలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ కుశంగల ప్రమీల, గ్రామ పెద్దలు విచ్చేసి దుర్గామాత పూజలో పాల్గొన్నారు, […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ లో 100 మంది యువత బీఆర్ఎస్‌లో చేరిక

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల గ్రామానికి చెందిన సుమారు 100 మంది యువత ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గచ్చిబౌలి డివిజన్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా సమక్షంలో, సీనియర్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా యువతకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ ప్రోత్సాహంతో యువత పార్టీలో […]

Continue Reading