ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ల సన్నాహాలు
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను ఈ నెల 22న రాయిదుర్గంలో ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు నీలం నరేందర్, అంబటి అశోక్, సదాల నరేందర్, నీలం సురేందర్, నీరుడి దేవేందర్, నీరుడి కిరణ్, వినోద్, వెంకటేష్, కాశి, హరినాథ్, కొరివి వినోద్, బంటు శ్రీకాంత్, గొర్రెంక శ్రీకాంత్, గొర్రెంక గణేష్, మన్నె శ్రీనివాస్, కొండ బ్రహ్మయ్య, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్యతో పాటు పలువురు ముదిరాజ్ నాయకులు, రాయిదుర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
