పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గాంధీజీ చూపిన అహింస మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఘనపూర్ మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, సంతోష్ గుప్తా, రాఘవేందర్ లు అన్నారు.పటాన్ చెరు మండలంలోని ఘనపూర్ గ్రామంలో గ్రామస్తులు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనపూర్ గ్రామంలో గత 60 సంవత్సరాల క్రితం గ్రామ పెద్దలు దుర్గారెడ్డి, చొక్కారపు ఈశ్వరయ్య, నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతి రోజున విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు మాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని చెప్పారు. నేటి తరాలకు మహాత్మా గాంధీ చరిత్రను తెలిపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున సంతోష్ కిరాణా అండ్ జనరల్ స్టోర్ షాపు ప్రారంభించడం జరిగిందని, షాప్ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.రవి, మాజీ వార్డు సభ్యుడు శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ఖాజామీయా, కే.యాదయ్య, రాఘవేందర్ గౌడ్, చొక్కారపు సంతోష్, కృష్ణకాంత్ గౌడ్, కే.రవి, చొక్కారపు సాయి ప్రసాద్, కృష్ణచారి, కే.రమేష్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
