మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షుడి బోనాల నారాయణచారి జన్మదిన వేడుకలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం రైల్వే ట్రాక్ సమీపంలో గల టింబర్ డిపోలో విశ్వకర్మ ముద్దుబిడ్డ బోనాల నారాయణ చారి 54వ జన్మదిన వేడుకలను చిన్ననాటి మిత్రులు, అభిమానులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణచారిని పూలదండలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షుడిగా, రాజకీయంలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ నారాయణచారి సమాజానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తన పరిధిలో ఎంతోమందికి చేదోడు వాదోడుగా నిలుస్తూ, విశ్వకర్మ ఆడబిడ్డల వివాహాలకు పుస్తెలు, ఆర్థిక సహాయం అందిస్తూ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బొల్లారం భరత్ చారి, పోలీస్ వెంకట చారి, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు అశోక్ చారి, శ్రీశైలం చారి, మిత్రులు వెంకన్న, యాదప్ప, కాజా, కుమార్ చారి, విశ్వకర్మ సంఘం సభ్యులు, అభిమానులు    పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *