మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ తండ్రి కుమార్ గౌడ్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముత్తంగి శ్రీకాంత్ గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమార్ గౌడ్ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. కుమార్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

