2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి

Districts politics Telangana

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి :

2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బిజెపి సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు .భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుదీర్ఘంగా 25 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో మచ్చలేని సేవలు అందిస్తూ, దేశానికి ప్రగతి బాటలు వేస్తున్న సుపరిపాలనకు సంకేతంగా బిజెపి సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో “సేవా జ్యోతి యాత్ర”ను బుధవారం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా నిర్వహించారు.సంగారెడ్డి లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి హాజరై యాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తి   మాట్లాడుతూ సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సమగ్ర రంగాభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అపరిమిత నిధులు, సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వికసిత్ భారత్ 2047′ సుదూర లక్ష్యంతో నూతన సమృద్ధి, స్వయం సమృద్ధి (స్వావలంబన) మరియు నవ భారత నిర్మాణానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు దేశ యువతలో, ప్రజల్లో కొత్త స్ఫూర్తిని, ఆశావహ దృక్పథాన్ని నింపిందని ఆయన కొనియాడారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక సుపరిపాలనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపే ప్రయాణంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *