మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు పట్టణంలోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.అనంతరం మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రమిదల వెలుగుల తరహాలోనే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ, ఆనందం, ప్రేమ, ఐకమత్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, సురక్షితమైన పద్ధతుల్లో ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలను జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
