మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజాల కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ – తెలంగాణ హసిత నారాయణభట్ట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా ప్రదర్శన ఆకట్టుకుంది. గర్బా, డాండియా, సంగీతం, పండుగ సంబరాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నామని, అదే సమయంలో 2030 నాటికి 10 లక్షల మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీని నిర్మించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నామని రాజీవ్ రెడ్డి తెలిపారు.
సంప్రదాయ నవరాత్రి స్ఫూర్తిని గర్బా, డాండియా, సంగీతం, వినోదంతో కలిపి ఆధునిక వేడుకల అనుభూతిని అందిస్తోందని, హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని కంట్రీ క్లబ్స్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.2030 నాటికి 10 లక్షల మంది సభ్యులను చేరుకోవాలనే లక్ష్యానికి స్పష్టమైన వ్యూహం ఉందని, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్లబ్‌లు, ఫిట్నెస్, హాలిడేస్, వివిధ అనుభవాలను ఆస్వాదించేలా ఒక సమగ్ర ఎకోసిస్టమ్‌ను రూపొందించాలనేది లక్ష్యం ముందుకు వెళ్తున్నామన్నారు.
ఇప్పటికే ఉన్న, కొత్త సభ్యులకు మరింత విలువైన సేవలను అందించేందుకు 500 కొలాబొరేటెడ్ క్లబ్‌లు, 1,000 ఫిట్నెస్ సెంటర్లు, దేశీయ మరియు అంతర్జాతీయంగా 1,000 హాలిడే డెస్టినేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజీవ్ రెడ్డి తెలిపారు.
అదే సమయంలో CCIP (Country Club Entrepreneur Program)ను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా వ్యక్తులు తమ సొంత వ్యాపారాన్ని నిర్మించుకుని, తమకు తామే బాస్‌గా ఎదుగుతూ, కంట్రీ క్లబ్ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములుగా వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
‘Rel-event’ ఎండీ సందీప్ కుమార్ చందా మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుండి 20 వరకు బేగంపేటలోని విశాలమైన పోలీస్ హాకీ స్టేడియంలో జరగనున్న 10 రోజుల బహిరంగ వేడుక ‘నవరాత్రి ఉత్సవ్ దాండియా నైట్స్’ ఒక అద్భుతమైన వేడుకగా నిలవనుందని తెలిపారు.
