సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి: కాట శ్రీనివాస్ గౌడ్

politics Telangana

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తన నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరుకానున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామం, డివిజన్ నుంచి కాంగ్రెస్ శ్రేణులను సమీకరించి సభకు తరలించేలా నాయకులు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు.పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు సిద్దిపేట సభకు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కాట శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *