సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి , సంగారెడ్డి : సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు.సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీజేపీ అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని వారాహి కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం […]

Continue Reading

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిస్లరీ యజమాన్యం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కార్మికుల అక్రమ తొలగింపులపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి విన్నవించిన సిఐటియు నాయకులు సానుకూలంగా స్పందించిన మంత్రి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:  కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాల రాస్తున్న బిస్లరీ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు.బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామిని […]

Continue Reading

ఎస్‌ఐఆర్ అమలులో లోపాలు సరిదిద్దాలి బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు బలరాం

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) కార్యక్రమం సమర్థవంతంగా అమలు కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు, శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం పేర్కొన్నారు.తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ,ఎన్యుమరేషన్ దరఖాస్తులను నింపడం లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో విస్తృత […]

Continue Reading

బిస్లరీ కార్మికులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీ లోకి తీసుకోవాలి బిస్లరి కార్మికులు మోకాళ్లపై నిరసన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : బిస్లరీ కార్మికులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ యజమాన్యాన్ని హెచ్చరించారు.ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వడ లో గల బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం […]

Continue Reading

టియుడబ్ల్యూజే యూనియన్ పోస్టర్ ఆవిష్కరణ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్‌చెరు : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభ ఈనెల 9వ తేదీన సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీవో భవన్ లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు, రుమాండ్ల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. పటాన్‌చెరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కు సంబంధించిన పోస్టర్లను స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

అణు నిర్మాణాల గణిత నమూనాపై పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని జైనా ప్రణవి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘టోపోలాజికల్ సూచికలను ఉపయోగించి అణు నిర్మాణాల గణిత నమూనా రూపకల్పన, గ్రాఫ్ సైద్ధాంతిక విధానం’పై ఆమె పూర్తి స్థాయి పరిశోధక విద్యార్థిగా అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ […]

Continue Reading

పెంచిన కనీస వేతనాలను వెంటనే అన్ని పరిశ్రమంలో అమలు చేయాలి

జూన్ వేతనంతో కలిపి ఇవ్వాలి అమలు చేయని పరిశ్రమల వద్ద ఆందోళన సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే అన్ని పరిశ్రమలలో అమలు చేయాలని, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్మాణ్ సంస్థ చేయూత

– బ్యాగులు, బుక్కులు అందజేత మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : తాము సంపాదించిన దాంట్లో కొంత పేదవారి చదువులకు ఉపయోగించాలనే సేవా భావం తో కొందరు యువతి, యువకులు ముందుకు వచ్చారు. నిర్మాణ్ ఆర్గనైజేషన్ మరియు ఓపెన్ టెక్స్ట్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్   ద్వారా శేరిలింగంపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయుతనందిoచారు. ప్రభుత్వ పాఠశాలలొ చదువుతున్న విద్యార్థులకు బడి పునఃప్రారంబ కావడంతో సేవా కార్యక్రమంలో భాగoగా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా […]

Continue Reading

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భారత మాజీ ఉప ప్రధాని, దేశంలో సామాజిక న్యాయ సాధనకు అవిరళ కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పటాన్‌చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి స్థానిక మాజీ ప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Continue Reading

ఇష్టంతో చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇష్టపడి చదివి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ ఆధ్వర్యంలో […]

Continue Reading