అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే డ్యూటీ లోకి తీసుకోవాలి
బిస్లరి కార్మికులు మోకాళ్లపై నిరసన
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
బిస్లరీ కార్మికులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ యజమాన్యాన్ని హెచ్చరించారు.ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వడ లో గల బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం బిస్లరీ కార్మికులు మోకాళ్ళపై నిరసన కూర్చుని విన్నత్నంగా తమ నిరసనను తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యం చట్టాలను ఉల్లంఘించి కార్మికుల హక్కులను కాలు రాస్తుందని ఆరోపించారు. చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే ఉద్యోగాలను పీకేస్తారా అని, బిస్లరీ పరిశ్రమ భారతదేశంలో లేదా అని, దేశ చట్టాలు అంటే గౌరవం లేదా అని ప్రశ్నించారు. చట్టానికి విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని, భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బిస్లరీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ గౌడ్, నవీన్, సతీష్ గౌడ్, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
