టియుడబ్ల్యూజే యూనియన్ పోస్టర్ ఆవిష్కరణ

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్‌చెరు :

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభ ఈనెల 9వ తేదీన సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీవో భవన్ లో జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు, రుమాండ్ల అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. పటాన్‌చెరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కు సంబంధించిన పోస్టర్లను స్థానిక జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుమాండ్ల అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పర్చ శ్రీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డిలో జరిగే జిల్లా స్థాయి సమావేశాల్లో జిల్లా కమిటీలు నియమించనున్నారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే తీర్మానాలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా అందరూ కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మొదటిసారి సంగారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకబోతున్నామని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న పాత్రికేయులు పాల్గొని.. జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్రా రామారావు, సయ్యద్ సులేమాన్, కాశీపతి, పత్తి నరసింహ, ఏబీఎన్ యాదగిరి,బసవేశ్వర్, బాలు, శ్రీనివాసరెడ్డి, బీసీఎన్ శ్రీనివాస్, మాజీద్ అలీ, మడపటి శేఖర్, వివేక్, కోటేష్, శివాజీ, ప్రభాకర్ యాదవ్, సిద్దు, రాము, సంజీవ, రాజు, సలీం, విజయ్ కుమార్, బండి పురుషోత్తం, శంకర్, రాము,దశరత్, సంతోష్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *