అయ్య‌ప్ప స్వామి ఆల‌య అభివృద్దికి బీఆర్ఎస్ నేత మాద్రి పృధ్వీరాజ్ దాతృత్వం

politics Telangana

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు, ఆల‌యాల‌ అభివృద్దికి త‌న వంతు పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు,యండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ అన్నారు . ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం అమీన్ పూర్ ప‌రిధిలోని బీరంగూడ‌లో నిర్మాణంలో ఉన్న శ్రీశ్రీశ్రీ అయ్య‌ప్ప స్వామి దేవ‌స్థాన అభివృద్దికి , ద్వార పాల‌కుల మండ‌పం నిర్మాణం కోసం ఏడు ల‌క్ష‌ల నూట ప‌ద‌హారు రూపాయ‌లు విరాళాన్ని అందించారు. ఈ నెల 22 న నిర్వ‌హించ‌నున్న శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పృథ్వీరాజ్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు . ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లు, దేవస్థాన నిర్మాణం, అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం దేవస్థాన అభివృద్ధికి తనవంతు సహకారంగా రూ.7,00,116 (ఏడు లక్షల నూట పదహారు రూపాయలు) విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థాన నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు .ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు దేవాలయాలు ప్రతీకలని అన్నారు. దేవాలయాలు కేవలం ప్రార్థనా మందిరాలే కాకుండా భక్తి, ఐక్యత, సేవాభావం, సామాజిక సమైక్యతను పెంపొందించే పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలని పేర్కొన్నారు.దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో భక్తులు, దాతలు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు నిరంతరం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పృథ్వీరాజ్ శాలువాతో సత్కరించి, దేవస్థాన అభివృద్ధికి ఆయన అందించిన రూ.7,00,116 విరాళానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన విరాళం దేవస్థాన అభివృద్ధి పనులకు ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, అయ్యప్ప స్వామి భక్తులు, MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *