వారాహి సిల్క్స్ సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో తేజ

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి,హైదరాబాద్:

ప్రముఖ వస్త్ర, ఆభరణాల బ్రాండ్ వారాహి తన విస్తరణలో భాగంగా వారాహి సిల్క్స్ 6.0 మరియు వారాహి సిల్వర్ జ్యువెలరీ 2.0 లను వనస్థలిపురం క్రాస్ రోడ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో తేజ సజ్జ కలిసి ప్రారంభించారు.వారాహి డైరెక్టర్లు మణిదీప్ యేచూరి మరియు డా. స్పందన మార్గదర్శకత్వంలో, నాణ్యత, ప్రత్యేక డిజైన్లు, సంప్రదాయం మరియు ఆధునిక షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో సంస్థ తన విస్తరణను కొనసాగిస్తోంది.వనస్థలిపురంతో పాటు దగ్గరలోని పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారాహి కలెక్షన్లు మరింత చేరువ చేసేందుకు వనస్థలిపురం లో తాము ఈ శాఖను ఎంచుకున్నట్లు, జూబ్లీ హిల్స్‌లో ప్రారంభమైన వారాహి సిల్క్స్** ప్రస్థానం అనంతరం కూకట్‌పల్లి, పాట్నీ, నెల్లూరు, విజయవాడలకు విస్తరించింది. ఇప్పుడు వనస్థలిపురంలో ఆరో స్టోర్ ప్రారంభంతో బ్రాండ్ తన విస్తరణను కొనసాగిస్తోంది.కొత్త స్టోర్‌లో కాంచీపట్టు, బనారసీ, బ్రైడల్, వెడ్డింగ్, ఫెస్టివ్, ట్రెడిషనల్ మరియు కాంటెంపరరీ చీరల విస్తృత శ్రేణి అందుబాటులో ఉంటుంది. నాణ్యత, నైపుణ్యమైన నేసుకళ మరియు ప్రత్యేక డిజైన్లకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి సందర్భానికి అనువైన కలెక్షన్లను వినియోగదారులకు అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *