గీతమ్ లో బీఏ, ఎంఏ అడ్మిషన్లు…

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీఏ, ఎంఏ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.బీఏ (ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సెన్ట్స్, సెక్షాలజీ, సోషియాలజీ, విజువల్ కమ్యూనికేషన్ మేజర్; డాన్స్ (భరతనాట్యం, కూచిపూడి/ మోహినీయాట్టం)ఎంఏ (అప్లయ్డ్ సెక్షాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు) కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు.
కనీస అర్హతా పరీక్షను 50 శాతం మార్కుల సగటుతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గీతం ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.ఇతర వివరాల కోసం 08455-221396 ను సంప్రదించాలని లేదా www.gitam.eduను సందర్శించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *