క్యాసారంలో బీజేపీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన గోదావరి అంజిరెడ్డి

politics Telangana

గోదావ‌రి అంజిరెడ్డి స‌మ‌క్షంలో బీజేపీలోకి చేరిన యువ‌కులు, మ‌హిళ‌లు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

భార‌తీయ జ‌న‌తా పార్టీ సిద్దాంతాల‌కు ఆక‌ర్షితులై స్వ‌చ్చంధంగా పార్టీలో చేర‌డం సంతోషంగా ఉంద‌ని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు . సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని క్యాసారం గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు.పార్టీలో చేరిన‌ ప్రతి ఒక్కరికీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సేవ, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు .బీజేపీ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన గోదావ‌రి అంజిరెడ్డి క్యాసారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్కరించారు . గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామ‌న్నారు . ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,రవీందర్ క్యాసారం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, సుధాకర్, నర్సింహా గౌడ్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *