దర్శించుకున్న పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి:
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మ దేవస్థానాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ మహోత్సవానికి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్ల ఆశీస్సులు పొందారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
