గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ ఎరిన్ ఓ’కానర్
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
చేతివృత్తిని (హస్తకళను) ఒక శారీరక, మేధోపరమైన అన్వేషణగా ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, గాజు తయారీ నిపుణురాలైన డాక్టర్ ఎరిన్ ఓ’కానర్ అభివర్ణించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హస్తకళల్లో లీనమవ్వడం: మనస్సు, శరీరంపై ప్రభావాలు అనే అంశంపై సోమవారం ఆమె ఆన్ లైన్ ద్వారా ఆతిథ్య ఉపన్యాసం చేశారు.గాజు కళాకారిణిగా తన అనుభవం, చేతివృత్తుల అధ్యయనాలలో ఆమె చేసిన విస్తృతమైన పరిశోధన ఆధారంగా, డాక్టర్ ఓ’కానర్ గాజు తయారీ అభ్యాసం ద్వారా చేతివృత్తికి సంబంధించిన శారీరక కోణాలను, శారీరక జ్జానం యొక్క స్వభావాన్ని అన్వేషించారు. గణనీయమైన శారీరక ఓర్పు, మేధోపరమైన ప్రమేయం, సృజనాత్మక సున్నితత్వం అవసరమయ్యే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, కళాకారులు తప్పులు, అనిశ్చితులు, వైఫల్యాలను ఎలా అధిగమిస్తారో ఆమె వివరించారు. చేతివృత్తితో నిరంతర అనుబంధం, కళాకారుడి మనస్సును, శరీరాన్ని క్రమంగా, తరచుగా సూక్ష్మమైన మార్గాలలో ఎలా తీర్చిదిద్ది, రూపాంతరం చెందిస్తుందో ఆమె మరింతగా చర్చించారు.ఈ ఉపన్యాసం శరీరం, మనస్సు, పదార్థం, సృజనాత్మక అభ్యాసం మధ్య ఉన్న క్లిష్టమైన సంబంధంపై విలువైన అంతర్దృష్టులను అందించింది. తద్వారా చేతి పనిని ఒక శారీరక, మేధోపరమైన అన్వేషణగా లోతుగా అర్థం చేసుకునేలా చేసింది.
అతిథి గురించి:
డాక్టర్ ఎరిన్ ఓకానర్, పీహెచ్.డి., గాజు, పదార్థ స్వభావం, దేహధారణ, కళ, పర్యావరణం వంటి అంశాలలో నైపుణ్యం కలిగిన, హస్తకళా అధ్యయనాలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్కాలర్. ఆమె ప్రస్తుతం న్యూయార్క్ నగరంలోని నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, ఆంత్రోపాలజీ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. గతంలో 17 యేళ్ల పాటు మేరీమౌంట్ మాన్ హట్టన్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా, విభాగాధిపతిగా పనిచేశారు. ఆమె గాజు తయారీ యొక్క శారీరక అనుభవంపై అధ్యయనమైన ‘ఫైర్ క్రాఫ్ట్: ఆర్ట్, బాడీ అండ్ వరల్డ్ అమాంగ్ గ్లాస్ బోయర్స్’ (కొలంబియా యూనివర్సిటీ ప్రెస్, 2025) అనే గ్రంథ రచయిత్రి. కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్ నుంచి 2023 రాకోవ్ గ్లాస్ రీసెర్చ్ గ్రాంట్ గ్రహీత అయిన ఆమె ప్రస్తుతం ‘ది మిడిల్ మినరల్ అండ్ ది మైన్: ఎ జియో ఆంత్రోపాలజీ ఆఫ్ స్టూడియో గ్లాస్’ అనే పుస్తక రచనలో నిమగ్నమైన ఉన్నారు.
