ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర
400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు
మనవార్తలు ప్రతినిధి, మియాపూర్:
ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో జయప్రకాశ్ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ఈ శిబిరం ద్వారా 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పేద ప్రజలకు ఉచిత వైద్యం ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం ఈ శిబిరంలో 400 మందికి పైగా ప్రజలు వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని, నిపుణులైన వైద్యుల సలహాలు, అవసరమైన మందులు, ఆరోగ్య మార్గదర్శకాలను ఉచితంగా పొందారు. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని కుటుంబాలకు అండగా నిలవడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

ఉదయ్ కిరణ్ సేవలను అభినందించిన జగదీశ్వర్ గౌడ్
ఈ సందర్భంగా శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్ ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న యువ నాయకుడని, ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులోనూ తన సహకారం ఉంటుందని తెలిపారు.యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమావేశాలు, సభ్యత్వ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, ఓటరు అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. మియాపూర్, మక్తా మహబూబ్పేట్, మయూరి నగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, ట్రాఫిక్ వంటి స్థానిక సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం కోసం సమన్వయం చేయడంపై దృష్టి సారిస్తున్నారు.యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య, కంటి పరీక్షల శిబిరాలు, వేసవి చలివేంద్రాలు, వృద్ధులకు పండ్ల పంపిణీ, అనాథాశ్రమాల్లో అన్నదానం, దివ్యాంగులకు సహాయం, పేద కుటుంబాలకు తోడ్పాటు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు ఆహార పంపిణీ, మట్టి వినాయక విగ్రహాల ప్రోత్సాహం వంటి కార్యక్రమాల ద్వారా కూడా సామాజిక బాధ్యతను చాటుతున్నారు.

ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ “ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా ప్రధాన ప్రాధాన్యం. ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉంది. ప్రజాసేవ అనేది ఒక్కరోజుతో ముగిసే కార్యక్రమం కాదు; నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత. విద్య, వైద్యం, యువజన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సంక్షేమ రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తాం” అని తెలిపారు.సేవతో సంపాదించిన విశ్వాసం.. ప్రజల సంక్షేమమే మా సంకల్పం!” అనే ఆశయంతో తన సేవా ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు.ఈ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతానికి సహకరించిన దాతలకు, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ యాజమాన్యానికి యలమంచి ఉదయ్ కిరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించినందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మన్నేపల్లి సాంబశివరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు నగేష్ నాయక్, నిజాంపేట కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మురళి, పట్వారీ శశిధర్, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, నడిమింటి కృష్ణ, శేరిలింగంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సునీత రెడ్డి, రాంచందర్ గౌడ్, శంకర్, రవికుమార్ గౌడ్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాసులు, సాంబయ్య, సురేష్, హృషికేశ్, మన్నె నరేంద్ర, రావు, శంకర్, రామకృష్ణ, దినేష్, సరిత, మణి, ధీరజ్, సుబానీ, గోపీనాథ్, నాయుడు, సుబ్బారాయుడు, శరత్, వంశీ, మధు, ప్రవీణ్, రత్నాచారి, కార్తిక్ రెడ్డి, సంజు, కృష్ణ, సాంబశివరావు, నవాజ్, ఇక్బాల్ , శేరిలింగంపల్లి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సౌందర్య రాజన్, మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్, శంకర్ గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు అనిత, జ్యోష్ణ, నజియా, కవిత, గోపి, రవి, కిరణ్, రాజీవ్, వెంకట్ రెడ్డి, రమేష్, జీవన్, శ్రీనివాసు, మూర్తి, రాజేష్, సుబ్బారావు, సల్మాన్, ఆసిఫ్, కరీం, మణిక్, ప్రసాద్, రఘు, వలభనేని నరసింహరావు, ప్రకాష్, సత్య, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
