రెడ్‌మీ నోట్ 17 5Gను ఆవిష్కరించిన నటి చెరుకూరి మానస చౌదరి

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

టాలీవుడ్ నటి చెరుకూరి మానస చౌదరి నగరంలో సందడి చేశారు. షావోమి ఇండియా తాజా రెడ్‌మీ నోట్ 17 5G స్మార్ట్‌ఫోన్‌ను తెలంగాణ మార్కెట్ లోకి మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సెల్ బే భాగస్వామ్యంతో గచ్చిబౌలి లోని సెల్ బే లో నిర్వహించిన కార్యక్రమంలో చెరుకూరి మానస చౌదరి ఈ రెడ్‌మీ నోట్ సిరీస్‌ను షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్, సెల్ బే సంస్ధ యం.డి సోమ నాగరాజు లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మానస చౌదరి మాట్లాడుతూ ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన కెమెరా వ్యవస్థ, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రెడ్‌మీ నోట్17 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వినియోగదారులకు కంపెనీ తాజా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంలో సెల్ బే కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. కాలానికి అనుగుణంగా పెరిగిన సాంకేతిక ఉత్పత్తుల వినియోగం పెరిగిందని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన మొబైల్ పోన్ లు, ఇతర యాక్ససెరీస్ ఉత్సత్తుల వినియోగం అనేది ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో బాగమైందన్నారు

ఈ సందర్భంగా సెల్ బే సంస్ధ యం.డి సోమ నాగరాజు మాట్లాడుతూ, వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికత, నాణ్యమైన స్మార్ట్‌ఫోన్లు, మెరుగైన సేవలు అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. షావోమి రెడ్‌మీ నోట్ సిరీస్‌లో తాజా రెడ్‌మీ నోట్ ను సెల్ బే షోరూమ్‌ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.ఆగస్టు 12 నుంచి రెడ్‌మీ నోట్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రత్యేక లాంచ్ ఆఫర్లు, సులభమైన EMI సదుపాయాలు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదనంగా 50W కరోకే స్పీకర్, ఏడాది థెఫ్ట్ ఇన్సూరెన్స్, Cellbay జూట్ బ్యాగ్ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.

మీడియాతో షావోమి అసోసియేట్ డైరెక్టర్ ప్రవీణ్ అష్టగి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ మహమ్మద్ ఇఫ్తేకర్ మాట్లాడుతూ, . రెడ్‌మీ నోట్ 17లో అత్యధికంగా 8,000mAh బ్యాటరీ, అధునాతన సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ ఇందులో ప్రత్యేకత అన్నారు. దీంతో రోజువారీ వినియోగంలో ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్‌తో పాటు బ్యాటరీపై ఆందోళనకు చెక్‌ పడుతుందన్నారు. ప్రీమియం True Colour AMOLED డిస్‌ప్లే, శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో సమగ్ర స్మార్ట్‌ఫోన్ అనుభూతిని REDMI Note 17 అందిస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *