నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం

politics Telangana

మహిధర లగ్జూరియా కాలనీ లో సమస్యల పరిష్కారానికి కృషి

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నూతన కాలనీలలో దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి అతి త్వరలో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తలారి బిక్షపతి, కోడూరి బిక్షపతి, కాలనీ అధ్యక్షులు స్వాతి, వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *