శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలి: కంజర్ల కృష్ణమూర్తి చారి

Districts politics Telangana

-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ

-దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

-ఆలయ పున ప్రతిష్ఠకు రూ. 11,111 విరాళం ప్రకటించిన కృష్ణమూర్తి చారి

నర్సాపూర్, మనవార్తలు ప్రతినిధి:

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామంలో శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహ ధ్వంసం ఘటనను నిరసిస్తూ నర్సాపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘జై విశ్వకర్మ  జై జై విశ్వకర్మ’ నినాదాలతో సాగిన ఈ మహా ర్యాలీకి రాష్ట్ర నలుమూలల నుండి సంఘాలకు అతీతంగా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ సమాజానికి కాలజ్ఞానాన్ని అందించి, ధర్మాన్ని, మానవతా విలువలను బోధించిన మహాజ్ఞాని, తత్వవేత్త శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ధ్వంసమైన చోట స్వామివారి విగ్రహాన్ని తిరిగి పున ప్రతిష్ఠించి, ఆలయాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని కోరారు. అనంతరం స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ నిమిత్తం కంజర్ల కృష్ణమూర్తి చారి తన వంతుగా రూ. 11,111 విరాళాన్ని అందజేశారు.సంఘాలకు అతీతంగా భారీ సంఖ్యలో హిందూ సంఘాల నాయకులు, విశ్వకర్మ సోదరులు తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్‌లతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు సుంకోజు కృష్ణమాచారి, సుంకోజు రమేష్ చారి, విశ్వకర్మ టీవీ కొండోజు నరసింహాచారి, ఎర్రోజు బిక్షపతి చారి, నర్సాపూర్ నరేంద్ర చారి, శ్రీపాద నరేష్ చారి, మహేష్ చారి, శ్రీనివాస్ చారి, చంద్రశేఖర్ చారి, రాజేంద్ర చారి, హనుమంతు చారి, సోమాచారి తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *