సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్
చిన్నారుల ఆనందమే నిజమైన పండుగ
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎండీఆర్ ఫౌండేషన్ సేవా సంప్రదాయం*
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాద్రి పృథ్వీరాజ్ చిన్నారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ప్రతి దీపావళి సందర్భంగా చిన్నారులకు ఆనందాన్ని పంచుతూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది కూడా చిన్నారులకు పటాకులు పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి పటాకులు కాలుస్తూ, సరదాగా గడిపి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ“చిన్నారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వుల కంటే విలువైనది మరొకటి లేదు. వారి ఆనందమే నాకు నిజమైన పండుగ. ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ఆశ, వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఆనందాన్ని పంచే ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున నిరంతరం కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.పటాకులు అందుకున్న చిన్నారులు ఆనందంతో “థాంక్యూ అన్నయ్య హ్యాపీ దీపావళి” అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిన్నారుల కేరింతలు, చిరునవ్వుల మధ్య వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.*పండుగల అసలైన స్ఫూర్తి ఆనందాన్ని పంచుకోవడమేనని చాటుతూ, చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపే లక్ష్యంతో ఎండీఆర్ ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
