సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్
కార్మికుల సమస్యలు సిఐటియు తోనే సాధ్యం యూనియన్ అధ్యక్షులు కే రాజయ్య
జేకే పెన్నార్ పరిశ్రమ సిఐటియు ఎన్నికల గేట్ మీటింగ్
పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
కార్మికులకు అండగా సిఐటియు జెండా ఉంటుందని వారు అన్నారు. సిఐటియు ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్, యూనియన్ అధ్యక్షులు కే రాజయ్యలు అన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గల జేకే పెన్నార్ పరిశ్రమలో ఈనెల 12న జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో పురస్కరించుకొని సోమవారం పరిశ్రమ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు కేవలం సిఐటియుతోనే పరిష్కారం అవుతాయన్నారు. జెకె ఫెన్నార్ లో కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఇప్పటి దాకా అధికారంలో ఉన్న హెచ్ఎంఎస్ కూటమి, బిఆర్టియు కూటమి వాళ్ళు గేట్ మీటింగ్ లలో సమాధానం చెప్పాలన్నారు. నాలుగు సంవత్సరాల అగ్రిమెంట్ ఎందుకు ఉందని, క్యాంటీన్ ఎందుకు బాగా లేదని, రిటర్మెంట్ బెనిఫిట్ లు ఎందుకు లేవని ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నించారు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్స్ సౌకర్యం, పిఎఫ్, బోనస్ లో కార్మికులకు అన్యాయం ఎందుకు చేశారని, అగ్రిమెంట్ యజమాన్యానికి అనుకూలంగా ఒప్పుకున్నారాని కార్మికులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. మేము ప్రశ్నించే వారికి కచ్చితంగా ఎన్నికలలో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు, ఇన్సూరెన్స్, పార్కింగ్ ,కొత్తగా పర్మినెంట్ ఎందుకు చేయటం లేదో చెప్పాలన్నారు. వందల కోట్లల్లో టర్నోవర్ ఉన్నప్పటికీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, బిఆర్టియు, హెచ్ఎంఎస్ కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండే సిఐటియు చుక్క గుర్తుకే ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా కార్మికులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, యూనియన్ అడ్వైజర్ బి పాండురంగారెడ్డి, వి ఎస్ రాజు, వెంకటేశ్వర్లు, మాణిక్, రామకృష్ణ, సంతోష్ తదితరులు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాంబయ్య, రాజకుమార్ బాబు, రాథోడ్, హారన్ నాయక్ కార్మికులు పాల్గొన్నారు.
