బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మల్లేపల్లి సోమిరెడ్డి దంపతులు
రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు తెల్లాపూర్ డివిజన్లోని తెల్లాపూర్ చెరువు వద్ద ఘనంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యతను చాటుతూ బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. దీంతో తెల్లాపూర్ చెరువు పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.వేడుకల్లో తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మల్లేపల్లి సోమిరెడ్డి, ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
