శాకాంబరేశ్వరుడిగా దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

Telangana

రుద్రారం శ్రీ గణేష్ గడ్డపై వైభవంగా ‘శాకాంబరీ’ అవతారం

పదవ రోజు శాకాంబరేశ్వరుడిగా సిద్ధి గణపతి రూపం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదవ రోజైన నేడు శ్రీ సిద్ధి గణపతి స్వామివారు ‘శాకాంబరేశ్వరుడి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల తాజా కూరగాయలతో స్వామివారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *