పాటి గ్రామంలో అంబరాన్నంటిన ‘సద్ది బతుకమ్మ’ వేడుకలు 

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు నియోజకవర్గం, ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామంలో సద్ది బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ శేక్‌దార్ శ్రీనివాస్ యాదవ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.​రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలలపై ఎత్తుకుని, డీజే పాటల హోరులో మహిళలు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా చెరువు ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఒకరికొకరు అలయ్-బలయ్ తెలుపుకొని బతుకమ్మలను చెరువులో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ విజయదశమి నవరాత్రులలో భాగమైన సద్ది బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. పాటి గ్రామంలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి పండుగను అందరం ఒకే వేదికపై కనులవిందుగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులు, యువత, కుల సంఘాల నాయకులకు, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.​ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజర్ నారపరెడ్డి, మాజీ సర్పంచులు మున్నూరు లక్ష్మయ్య, రాములు యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రజనీకాంత్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు సునీత గోపాల్ యాదవ్, మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, పటాన్‌చెరు మండల కురుమ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *