మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో లయన్స్ క్లబ్ -ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృధ్విరాజ్ అన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. పటాన్ చెరువులోని నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ , లయన్స్ క్లబ్ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మరింత విస్తృతం చేయాలని వైద్యులను కోరారు.ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జేపీ లయన్స్ క్లబ్ పటాన్‌చెరు చైర్మన్ జైపాల్ , లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, క్లబ్ సభ్యులు, వైద్యులు,సామాజిక సేవకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
