మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి, కాలాతీత అందాలకు ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశ ప్రజలకు అత్యంత ఇష్టమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, చైతన్యపురిలో కొత్త స్టోర్‌ను ఘనంగా ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది. పీఎంజే జ్యువెలర్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ దీపక్, చైతన్యపురి స్టోర్ మేనేజర్ మధన్ కుమార్ మరియు పీఎంజే జ్యువెలర్స్ కస్టమర్ల సమక్షంలో ఈ స్టోర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంతో పీఎంజే జ్యువెలర్స్ తన రిటైల్ ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. దీనితో భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ స్టోర్ల సంఖ్య 47కి చేరింది.
కొత్తగా డిజైన్ చేసిన ఈ స్టోర్, సాంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక సౌందర్యంతో మిళితం చేసి, కస్టమర్లకు ఒక అద్భుతమైన ఆభరణాల కొనుగోలు అనుభవాన్ని అందిస్తోంది. ఇక్కడ హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యువెలరీ భారీ కలెక్షన్ అందుబాటులో ఉంది. ఇందులో టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ నెక్లెస్‌లు, వడ్డాణాలు, బ్రైడల్ జ్యువెలరీ సెట్లు, హాఫ్-చీర మరియు అకేషన్-వేర్ ఆభరణాలు, డైమండ్ జ్యువెలరీతో పాటు రంగురంగుల రత్నాలతో తయారు చేసిన అలంకరణలు ఉన్నాయి. అంతేకాకుండా, కుందన్, పోల్కి, జడవు స్టైల్స్‌తో పాటు రోజువారీ ధరించే తేలికపాటి నెక్లెస్‌లు, ఇయర్రింగ్స్ మరియు రింగుల విస్తృత శ్రేణిని కూడా కస్టమర్లు పరిశీలించవచ్చు.
ఈ కొత్త స్టోర్ ప్రారంభం గురించి పీఎంజే జ్యువెలర్స్ సీఈఓ కిరణ్ షిండే మాట్లాడుతూ, “చైతన్యపురిలోని మా కొత్త స్టోర్‌తో నాలుగు రాష్ట్రాల్లో పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ల సంఖ్య 47కి చేరింది. గత 60 ఏళ్లుగా కాలాతీత హస్తకళా నైపుణ్యం కోసం కస్టమర్లు మాపై నమ్మకం ఉంచుతున్నారు. ఆ వారసత్వాన్ని మరియు వ్యక్తిగత షాపింగ్ అనుభవాన్ని దిల్సుఖ్నగర్ ప్రాంత కుటుంబాలకు మరింత దగ్గర చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొత్త స్టోర్ సాంప్రదాయ కళను, ఆధునిక డిజైన్‌ను ఏకం చేస్తూ.. నాణ్యత, పారదర్శకత మరియు తరతరాలుగా కస్టమర్లు మా బ్రాండ్‌పై ఉంచిన నమ్మకానికి అద్దం పడుతోంది” అని తెలిపారు.
