గీతంలో ఎన్.సి.సి. ర్యాంక్ ప్రదానోత్సవం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాయకత్వం, క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతకు గుర్తింపుగా వివిధ ర్యాంకులకు పదోన్నతి పొందిన క్యాడెట్లను గీతం ఎన్.సి.సి. హైదరాబాద్ 33 (టి) బెటాలియన్, సంగారెడ్డి గురువారం నిర్వహించిన ర్యాంక్ ప్రదానోత్సవంలో సత్కరించింది.

ఈ వేడుకలో క్యాడెట్లు లాన్స్ కార్పోరల్, కార్పోరల్, సార్జంట్, కంపెనీ సార్జెంట్ మేజర్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ సార్జెంట్, జూనియర్ అండర్ ఆఫీసర్, సీనియర్ అండర్ ఆఫీసర్ ర్యాంకులకు పదోన్నతి పొందారు. కొత్తగా పదోన్నతి పొందిన క్యాడెట్లను అభినందించి, వారి బాధ్యతలను గర్వం, నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వర్తించాలని ప్రోత్సహించారు.

ఎన్.సి.సి. ర్యాంకులు విశ్వాసం, బాధ్యత, నాయకత్వం, సేవకు ప్రతీకలని నిర్వాహకులు ప్రకటించారు. క్యాడెట్లు ఆదర్శంగా నిలిచి తమ తోటి క్యాడెట్లకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కొత్తగా పదోన్నతి పొందిన క్యాడెట్లు తమ కొత్త పాత్రలు, బాధ్యతలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చేసిన కరతాళ ధ్వనులతో ఈ వేడుక ముగిసింది.

పదోన్నతి పొందిన క్యాడెట్లు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ విలువలను నిలబెడతారని, వారి ఆదర్శప్రాయమైన ప్రవర్తన, నిబద్ధత ద్వారా గీతంకు గర్వకారణంగా నిలుస్తారని గీతం ఎన్.సి.సి. యూనిట్ విశ్వాసం వ్యక్తపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *