పటాన్చెరు, మనవార్తలు ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నూతన సీఐ టి.మహేష్ ను ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ నిజాముద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన మహేష్ ను శ్రీ రేణుకా ఏలమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులు శాలువతో సన్మానించి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మహేష్ తో పరిచయం చేసుకుని, ఆటో కార్మికులకు సంబంధించిన స్థానిక అంశాలపై చర్చించినట్లు మహమ్మద్ నిజాముద్దీన్ బాబా తెలిపారు . దీపావళీ పండుగ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ,శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా ఏలమ్మ తల్లి ఆటో యునియన్ సభ్యులు డి.రాము, రాజు, సత్వేల్, అనిల్, లక్ష్మన్, ఎడుకొండలు, లింగం, జంగయ్య, చిన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
