శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

politics Telangana

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో.. ఈ నెల 22వ తేదీన నిర్వహించ తలపెట్టిన విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రికను బుధవారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ.. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్, మాజీ ఎంపీటీసీ అనిల్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *