దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కంజర్ల కృష్ణమూర్తి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

పటాన్‌చెరు నియోజకవర్గంలో గల భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన సుమారు 19 దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బీజేపీ సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్‌ సెల్‌ కన్వీనర్‌ కంజర్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ, అన్నప్రసాద వితరణకు ఆర్థిక సహాయం అందించారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో సునంద కృష్ణమూర్తి, రాజేందర్‌ చారి, సాయి, వెంకట హర్ష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *