జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

Hyderabad Lifestyle Telangana

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ పెట్ కేర్ బ్రాండ్ ఆధ్వర్యంలో మూడో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే (IHPD) వేడుకలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు శునకాలు, పిల్లులతో పాల్గొని సందడి చేశారు. పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, ముందస్తు ఆరోగ్య సంరక్షణ (ప్రోయాక్టివ్ పెట్ హెల్త్‌కేర్)పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో పెంపుడు జంతువులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, వెటర్నరీ వైద్యుల సలహాలు, వెల్‌నెస్ కన్సల్టేషన్లు, పెట్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పెట్ పేరెంట్స్‌కు అత్యవసర పరిస్థితుల్లో జంతువులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై వెటర్నరీ నిపుణులు అవగాహన కల్పించారు.
దేశంలోని 15కి పైగా నగరాల్లోని 35 జిగ్లీ పెట్ కేర్ కేంద్రాల్లో జరిగిన ఈ వేడుకల్లో 2,500కు పైగా పెంపుడు జంతువులు, 3,500 మందికి పైగా పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు.

లైఫ్ ఈజ్ సింప్లీ, అన్‌డినైయబ్లీ బెటర్ టుగెదర్” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిగ్లీ పెట్ కేర్ పెట్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ను కూడా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిగ్లీ పెట్ కేర్ సీఈఓ సౌరభ్ జైన్ మాట్లాడుతూ, “ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే అనేది పెంపుడు జంతువులు, వాటి కుటుంబాల మధ్య ఉన్న అపూర్వమైన అనుబంధాన్ని జరుపుకునే వేదిక. ఈ ఏడాది ముందస్తు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చాం. 24 గంటల వెటర్నరీ సేవల విస్తరణ, పెట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ల ప్రారంభం, నిపుణుల సేవలను మరింత మందికి చేరువ చేయడం ద్వారా దేశంలో అత్యంత విశ్వసనీయమైన పెట్ హెల్త్‌కేర్ వ్యవస్థను నిర్మించాలన్నదే మా లక్ష్యం” అని తెలిపారు.జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లో జరిగిన వేడుకల్లో స్నఫుల్ మ్యాట్ ఛాలెంజ్, బెస్ట్ ట్రిక్ షోడౌన్, పెట్ బింగో, క్యారికేచర్ కార్నర్, ఫోటో బూత్ వంటి ఆకర్షణీయ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పెట్ పేరెంట్స్ తమ పెంపుడు జంతువులతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు.హైదరాబాద్‌లో పెంపుడు జంతువులను పెంచుకునే కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటి ఆరోగ్య సంరక్షణ, టీకాలు, పోషకాహారం, రెగ్యులర్ వెటర్నరీ చెకప్‌లపై అవగాహన పెంచేందుకు జిగ్లీ పెట్ కేర్ నిర్వహిస్తున్న ఇలాంటి కమ్యూనిటీ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.సామాజిక బాధ్యతలో భాగంగా ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే టికెట్ విక్రయాల ద్వారా సమీకరించిన రూ.6 లక్షల మొత్తాన్ని జిగ్లీ ఫౌండేషన్‌కు అందజేశారు. ఈ నిధులను వీధి కుక్కలకు యాంటీ రేబీస్ టీకాలు, డీవార్మింగ్, రిఫ్లెక్టివ్ కాలర్ పంపిణీ, రెస్క్యూ కార్యకలాపాలు, దత్తత కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *