రూ.1.36 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
మనవార్తలు ప్రతినిధి ,తెల్లాపూర్ :
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేస్-2లో టీమ్ పవన్ పుత్ర ఆధ్వర్యంలో మంగళవారం బడా గణేష్ లడ్డూ వేలం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేలంలో మొదటి లడ్డూ రూ.1.36 లక్షలకు, రెండో లడ్డూ రూ.60 వేలకు వేలం పలికింది. అదేవిధంగా నిర్వహించిన లక్కీ డ్రాలో 11వ బ్లాక్‌కు చెందిన లబ్ధిదారుడు లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూలను సొంతం చేసుకున్న సభ్యులకు టీమ్ పవన్ పుత్ర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు లడ్డూ సొంతం చేసుకున్న సభ్యుల కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో ఉండాలని టీమ్ పవన్ పుత్ర సభ్యులు ఆకాంక్షించారు.
