పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సత్యం, అహింస, పరిశుభ్రతలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలి అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం అన్నారు . జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం మాట్లాడుతూగాంధీజీ కేవలం ఒక వ్యక్తి కాదని, అపారమైన శక్తినని కొనియాడారు. లండన్ లో లా చదివిన వ్యక్తి, దక్షిణాఫ్రికా దేశంలో తెల్ల జాతీయులు, నల్లజాతీయులు జాతీయ వివక్ష ఉండే అందరికీ సమాన హక్కులని 20 సంవత్సరాలు పోరాటం చేసిన మహాత్మా గాంధీ అని అన్నారు, సత్యం, అహింస అనే రెండు ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిరాయుధులను చేసి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానీయుడని కొనియాడారు. పరిశుభ్రత, స్వదేశీ వస్తువుల వినియోగం, సమానత్వం గాంధీజీ బోధించిన ముఖ్య సూత్రాలని, వాటిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. నేడు దేశమంతటా పండుగ వాతావరణంలో గాంధీ జయంతి జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు . ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఈవో సురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాదాస్ రాజశేఖర్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మల్లేశం ముదిరాజ్, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
