చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన సినీ నిర్మాత ప్రీతి పులిపాక

Hyderabad Lifestyle Telangana

_చేనేతకారులకు మరింత చేయూతనివ్వాలి

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్ లో  ఏర్పాటైన హ్యాండ్ టూ హ్యాండ్  చేనేత వస్త్ర ప్రదర్శన  – 2026 ను మిసెస్ ఆసియా గ్రేట్ బ్రిటన్ రన్నర్ అప్, సినీ నిర్మాత పులిపాక ప్రీతి  ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలు లో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. చేనేత ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదని, నేటి తరం యువత కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని పులిపాక ప్రీతి అన్నారు. నిర్వాహకులు  జయేష్ గుప్తా  మాట్లాడుతూ ఈ నెల 9వ తేది వరకు  కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 74 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *