జిన్నారం, మనవార్తలు ప్రతినిధి:
పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి జిన్నారం 18వ వార్డు కౌన్సిలర్ ఎర్రవల్లి దీనా ప్రవీణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు . తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలలో వెలుగులు నింపాలని సంకల్పంతో మరిని ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి నిరుపేద కుటుంబం ఇందిరమ్మ గృహాలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇల్లు లేదని చింతించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ గృహాలలో దీపావళి సంబరాలు చేసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరయ్య గోకర వెంకటేష్ పల్నాటి భాస్కర్ యనగండ్ల నరేందర్ వడ్ల నరేష్ అనిల్ లాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
