ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు..
ప్రముఖ భోజ్పురి గాయకుడు రితేష్ పాండే, గాయకురాలు కావ్య లతో సంగీత కచేరీ..
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:
నవంబర్ 15 ఆదివారం సాయంత్రం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు వేదికగా ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఛట్ పూజ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత 15 సంవత్సరాలుగా పటాన్చెరు వేదికగా ఛట్ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలతో పాటు సొంత నిధులతో ఉచితంగా చెరుకును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఉత్తర భారతీయుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలుస్తూ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. ఛట్ పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ రామచంద్రా రెడ్డి, రాజు, సుధాకర్ గౌడ్, సంజయ్ సింగ్, టింకు, తదితరులు పాల్గొన్నారు.
