మెరుగైన వేతన ఒప్పందాలు సిఐటియుకే సాధ్యం

politics Telangana

కార్మికుల పక్షాన నిలబడే సీఐటీయు నే గెలిపించండి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తోషిబా పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడే సిఐటియు నే గెలిపించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోషిబా పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు జే మల్లికార్జున్ పరిశ్రమ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరు మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో కార్మిక సంఘం ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం తోషిబా కార్మికుల ఎన్నికల గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్   హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ నిరంతరం కార్మికుల కష్ట సుఖాలలో నేనున్నానంటూ కార్మికులకు బాసటగా నిలిచే సీఐటియు నే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్మికుల కోసం నిరంతర సేవ చేసే సంఘం సిఐటియు అని,ప్రతిపక్ష కార్మిక సంఘాలు కార్మికులకు ఏం చెయ్యరనేది తెలుసన్నారు. సీఐటీయూ ని ఓడించడానికి అందరు కలిసి వస్తున్నారని, ఇప్పుడే కార్మికులు జాగ్రత్తగా ఉండాలని, ఐ ఎన్ టి యు సి కూటమిని ఓడించాలని కోరారు. వేతన ఒప్పందలు చేయడంలో సిఐటియు అగ్ర గ్రామీణ ఉందని వారు అన్నారు, కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు సాధించడంలో సిఐటియు చరిత్ర సృష్టిస్తుందన్నారు. కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉన్న నాయకత్వం సిఐటియు మాత్రమేనని, కార్మికుల హక్కుల కోసం నిరంతరం తపించే వాళ్లు సిఐటియు నాయకులన్నారు. మరోసారి తోషిబా పరిశ్రమ కార్మికులకు చట్టపరమైన సౌకర్యాలతో పాటు మెరుగైన వేతన ఒప్పందం ఇతర సమస్యలు పరిష్కారం జరగాలంటే చుక్క గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని వారు ఈ సందర్భంగా కార్మికులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బి మల్లేష్, కే రాజయ్య, పాండురంగారెడ్డి,అనంతరావు, పుల్లంరాజు, శ్రీధర్, విఎస్ రాజు, వేణుగోపాల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *