టీడబ్ల్యూజెఎఫ్ సహాయ కార్యదర్శిగా బక్కోల్ల రాము నియామకం

politics Telangana

-పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీ గురువారం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా పటాన్‌చెరు ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో నేటి దినపత్రిక సూర్య పటాన్ చెరు,రిపోర్టర్ బక్కోల్ల రాముకు సహాయ కార్యదర్శిగా అవకాశం దక్కింది.ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పటాన్‌చెరు నియోజకవర్గ నూతన కమిటీలో నన్ను సహాయ కార్యదర్శిగా ఎన్నుకుని నాపై నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ అవకాశం కల్పించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్,జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర నాయకులు మేకల కృష్ణయ్య, ప్రభు జాతీయ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి , అలాగే నూతనంగా ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షులు బాదిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కొత్తకొండ సత్యంతో పాటు నా తోటి సహాయ కార్యదర్శులు గిరి,ప్రసాద్, కృష్ణాగౌడ్ ఉన్నారు. నాపై విశ్వాసం ఉంచిన సహచర జర్నలిస్టు మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూమీ అందరి ఆశయాలకు అనుగుణంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సంఘ బలోపేతం కోసం నిబద్ధతతో పనిచేస్తానని రాము తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *