దాతృత్వ స్ఫూర్తిని చాటిన గీతం బీ-స్కూల్ విద్యార్థులు

Lifestyle Telangana

మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం చిన్నారులతో ఆహ్లాదంగా ఓ రోజు

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదు ఎంబీఏ విద్యార్థులు శుక్రవారం బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ప్రతి యేడాది మాదిరే, ఈసారి కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్’ (ఇవ్వడంలోనే ఆనందం) పేరిట మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం (చిన్నారులు, వృద్ధుల గృహం) చిన్నారులను గీతంకు ఆహ్వానించి, రోజంతా వారిలో ఉత్సాహాన్ని నింపడమే గాక, దయ, దాతృత్వ స్ఫూర్తిని చాటారు. వారిలో కొంగొత్త ఆశలను రేకెత్తించారు. వివేకానంద సేవా సంఘంకు చెందిన స్వచ్ఛంద సేవకుల నేతృత్వంలోని 41 మంది బాలలను ఎంబీఏ విద్యార్థులు గీతం ప్రాంగణానికి ఆహ్వానించి, వారితో కలిసి ఆనందంగా, వినోదాత్మకంగా, అర్థవంతమైన కార్యక్రమాలతో రోజంతా గడిపారు. ఆ బాలల కోసం ఆకర్షణీయమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంబీఏ విద్యార్థులు నిర్వహించారు. తాము అనాథలం కాదు, మనకోసం ఎందరో ఉన్నారనే ఐక్యతా వాతావరణాన్ని సృష్టించడమే గాక, వివిధ పోటీలలో గెలుపొందిన వారందరికీ ఆకట్టుకునే బహుమతులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో గీతం బీ-స్కూల్ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా; రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొని, విద్యార్థుల చొరవను ప్రశంసించారు. ఇంత మంచి సంప్రదాయాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు అభినందించారు. కీలకమైన నాయకత్వ లక్షణం- కరుణ యొక్క ప్రాముఖ్యతను వారు ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ ‘జాయ్ ఆఫ్ గివింగ్’ కార్యక్రమాన్ని జీఎస్ బీ అధ్యాపకులు డాక్టర్ నాగప్రియ, డాక్టర్ శ్రీకాంత్, విద్యార్థి నిర్వాహకులు శ్లోక, సుచితలతో కలిసి సమన్వయం చేశారు.బాలల సంక్షేమం, విద్య పట్ల గీతం యొక్క అచంచలమైన అంకితభావంలో భాగంగా, సేవా సంఘం బాలలందరికీ స్వెట్టర్లు, స్టేషనరీ, టీ-షర్టులను పంపిణీ చేశారు. దీనికి అదనంగా, విద్యార్థులు, అధ్యాపక బృందం కూడా వారి విద్యావసరాలకు మద్దతుగా తమవంతు సహకారాన్ని అందించారు. ఈ వేడుక దానగుణం నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించింది. చిన్న చిన్న దయగల పనులు ఎలా శాశ్వతమైన చిరునవ్వులను సృష్టించగలవో, చిన్న పిల్లల జీవితాలలో అర్థవంతమైన మార్పును తీసుకురాగలవో ఇది నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *